ప్రాథమిక హక్కుల కేసుగా ప్రఖ్యాతి గాంచిన కేసు..??

by Web Desk |
ప్రాథమిక హక్కుల కేసుగా ప్రఖ్యాతి గాంచిన కేసు..??
X

అన్నీ పోటీ పరీక్షలో పాలిటీ నుంచి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. పరీక్షల్లో రిపీట్ అయ్యే పాలిటీ ప్రశ్నలు కొన్ని చూద్దాం.

*భారత రాజ్యాంగానికి మూలాధారం- 1935 చట్టం

*భారత రాజ్యాంగ ప్రధాన లక్ష్యం- శ్రేయో రాజ్య స్థాపన

*భారత రాజ్యాంగం ఐరావతం వంటిది అని పేర్కొన్నది- హెచ్.వి కామత్

*రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది.

*భారత సమాఖ్య సహకార సమాఖ్య అని పేర్కొన్నది- ఆస్టిన్

*మౌంట్ బాటన్ ప్లాన్ కి మరో పేరు- జూన్ 3 ప్లాన్

*భారత రాజ్యాంగ మాగ్నాకార్టా గా పిలిచే భాగం- 3వ భాగం

*భారత రాజ్యాంగ లక్షణం- ఏకకేంద్ర సమాఖ్య

*భారత రాజ్యాంగ అర్థ సమాఖ్య- కెసీ వేర్

*భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడింది.

*భారత రాజ్యాంగసభ అధ్యక్షుడు- రాజేంద్ర ప్రసాద్

*రాజ్యంగ పరిషత్తు ఉపాధ్యక్షుడు- హెచ్.సీ ముఖర్జీ

*రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు- బి.ఆర్ అంబేద్కర్

*రాజ్యాంగ సభలో స్టేట్స్ కమిటీ చైర్మన్- నెహ్రూ

*భారత రాజ్యాంగ పరిషత అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు- వల్లభాయ్ పటేల్

*ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన పదాలు- సామ్యవాద, లౌకిక, సమగ్రత

*రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మవంటిదని పేర్కొన్నది- మహ్మద్ హదయతుల్లా

*ప్రవేశిక భారత రాజ్యాంగంలో భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కేసు- బెరుబారి కేసు(1960)

*ప్రాథమిక హక్కుల కేసుగా ప్రఖ్యాతి గాంచిన కేసు- కేశవానంద భారతి కేసు

*ఆస్తి హక్కు- చట్టబద్ధమైన హక్కు

*పత్రికా స్వేచ్ఛ- ఆర్టికల్ 19

*బాల కార్మిక నిషేద చట్టం- 1986

*ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించిన రాజ్యాంగ సవరణ- 44వ రాజ్యాంగ సవరణ

Advertisement

Next Story

Most Viewed