- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
APPSC: Apply Now..భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు
దిశ,వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15న ప్రారంభమైంది. మే5 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం రూ.48,000 నుంచి రూ.1,37,220 ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, నడక, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు: ఖాళీల సంఖ్య: 37 పోస్టులు,విభాగం: ఏపీ ఫారెస్ట్ సర్వీస్.
పోస్టుల కేటాయింపు: ఓసీ-14, బీసీ-12, ఈడబ్ల్యూఎస్-11.
జోన్ల వారీగా ఖాళీలు: జోన్ 1-08, జోన్ 2-11, జోన్ 3-10, జోన్ 4-08.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (అగ్రికల్చర్/కెమిస్ట్రీ/కంప్యూటర్ అప్లికేషన్స్/కంప్యూటర్ సైన్స్/ ఇంజినీరింగ్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ ఫారెస్ట్రీ/ జియోలజీ/ హార్టికల్చర్/ మ్యాథమెటిక్స్/ ఫిజిక్స్/ స్టాటిస్టిక్స్/ వెటర్నరీ సైన్స్/ జువాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థుల అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు.