- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్‌న్యూస్: భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు.. సమీపిస్తోన్న గడువు!
దిశ, వెబ్‌డెస్క్: అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. కలప స్మగ్లింగ్, పచ్చదనం పెంపు, అగ్ని ప్రమాదాల నివారణ, పెద్ద పులులు సహా వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ఈ అటవీశాఖలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి.
విభాగాల వారీగా ఖాళీలు..
అటవీశాఖలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 37 మంజూరు కాగా, 36 ఖాళీగా ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 3, 652 గానూ 1419, 4 వ తరగతి ఉద్యోగుల పోస్టులు 843 మంజూరు అవ్వగా.. 414ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ కన్జర్వేషటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టులు 61కు గానూ, 15 ఉన్నాయి. అలాగే ఐఎఫ్ఎస్ పోస్టులు 81 కు 26, ఫారెస్ట్ సెక్షన్ పోస్టులు 734 మంజూరవ్వగా 64 ఉన్నాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు 274 కు 21, అటవీ కళాశాలలో 66 కు 52 ఉన్నాయి. ఇతర పోస్టులు 1112 పోస్టులు మంజూరు కాగా 61 ఉన్నాయి. మొత్తంగా 6, 860 పోస్టులకు 4, 752 మంది సిబ్బందే ఉన్నారని, 2, 108 పోస్టులు ఉన్నాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
అర్హతలు - జీతం వివరాలు..
డిగ్రీ ఉత్తీర్ణులైన వారు మే 5వ తారీకు వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, సీపీటీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్ట్ చేయడం జరుగుతుంది. 18-30 సంవత్సరాల లోపు వారు అప్లికేషన్ కు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 48,000 నుంచి రూ.1. 37 లక్షలు జీతం పొందుతారు.