దారుణం.. యాక్సిడెంట్ చేసి డెడ్ బాడీతోనే 18 కిలో మీటర్లు ప్రయాణం

by Sathputhe Rajesh |   ( Updated:2024-04-15 03:57:09.0  )
దారుణం.. యాక్సిడెంట్ చేసి డెడ్ బాడీతోనే 18 కిలో మీటర్లు ప్రయాణం
X

దిశ, వెబ్‌డెస్క్: యాక్సిడెంట్ చేసి మృతదేహంతో ఏకంగా 18 కిలో మీటర్లు వెళ్లిన దారుణ ఘటన ఏపీ అనంతపురం జిల్లా ఆత్మకూరు వై.కొత్తపల్లి సమీపంలో జాతీయరహదారిపై చోటు చేసుకుంది. చోళసముద్రం గ్రామానికి చెందిన జిన్నే ఎర్రి స్వామి (35) ట్రాక్టర్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. పెళ్లి తర్వాత అనంతపురంలో సెటిల్ అయ్యాడు. వ్యక్తిగత పనులపై పి.సిద్దరాంపురం వెళ్లి ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో వై. కొత్తపల్లి సమీపంలోకి రాగానే ఇన్నోవా కారు స్వామి ప్రయాణిస్తున్న బైక్ ను అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వామి మృతదేహం కారుపై ఎగిరిపడింది. అయితే డెడ్ బాడీ ఉన్న కారుపై ఉన్న విషయాన్ని డ్రైవర్ గమనించకుండానే వెళ్లిపోయాడు. మృతదేహంతో 18 కిలో మీటర్ల దూరం కారు వెళ్లింది. దీంతో శవంతో వెళ్తున్న కారును వాహనదారులు వెంబడించారు. వాహనదారులు వెంటపడటంతో కారు ఆపి డ్రైవర్ పరారయ్యాడు. అయితే కారు బెంగళూరుకు చెందినదిగా గుర్తించారు. డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లు వాహనదారులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed