బెల్‌లో 27 ఇంజనీరింగ్ పోస్టులు

by Seetharam |
బెల్‌లో 27 ఇంజనీరింగ్ పోస్టులు
X

దిశ,వెబ్‌డెస్క్: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేస్తారు.

పోస్టుల వివరాలు:

ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు: 27

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 32 ఏళ్లకు మించరాదు.

వేతనం: నెలకు రూ. 40000 చెల్లిస్తారు.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 472 ఉంటుంది.

దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా పంపాలి.

అడ్రస్: మేనేజర్ (హెచ్ఆర్/ఏడిఎస్ఎన్, ఈఎస్ అండ్ సి-క్యూఏ) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జలహళ్లి పోస్టు ఆఫీస్, బెంగళూరు 560013.

చివరితేదీ: జులై 20, 2023

వెబ్‌సైట్: https://www.bel-india.in

Advertisement

Next Story

Most Viewed