- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పని చేయడం సిగ్గు అనిపించేది : అమెరికన్ పాప్ సింగర్
దిశ, సినిమా : సాధారణంగా ప్లాస్టిక్ సర్జరీల గురించి మాట్లాడేందుకు సెలబ్రిటీలు సిగ్గుపడుతుంటారు. కానీ అమెరికన్ పాప్ సింగర్ ‘కార్డి బీ’ మాత్రం ఎప్పుడు కూడా అలా ఫీల్ అవలేదు. తన మైండ్‌లో ఏమనుకుంటుందో అదే బయటకు చెప్పే నైజమున్న కార్డి బీ.. ప్లాస్టిక్ సర్జరీలు తనను మరింత కాన్ఫిడెంట్‌గా మార్చాయని తెలిపింది. చిన్నతనంలో తను చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యేదాన్నని తెలిపిన పాప్ సింగర్.. తన కాస్మెటిక్ ప్రొసీజర్స్ గురించి ప్రజల్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయని, కానీ ఇవి నిజంగా తనలో నమ్మకాన్ని పెంచాయనే చెప్పింది.
తను న్యూయార్క్‌కు చెందిన గర్ల్ అని.. ముఖ్యంగా బ్రోంక్స్ సిటీలో పెరిగానని తెలిపింది. తను చిన్నతనంలో చాలా సన్నగా ఉండేదాన్నని.. దీంతో యంగ్ బాయ్స్ నీ బ్రెస్ట్ ఫ్లాట్‌గా ఉందని హేళన చేసేవారని తెలిపింది. దీంతో ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతూ, బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌గా ఇయర్ రింగ్స్ వాడేదాన్నని తెలిపింది. ఇక 18 ఏళ్ల వయసులో తను డ్యాన్సర్‌గా మారాక, వచ్చిన సంపాదనతో ఇందుకోసం ఏం చేయాలో చేశానని చెప్పింది. ఇక 20 ఏళ్లలో అర్బన్ స్ట్రిప్ క్లబ్‌కు వెళ్తే, అక్కడ బట్ ఎక్కువగా ఉండాలని సూచించారని.. దీంతో బట్ ఎన్‌హాన్స్ చేసుకోవడమే తదుపరి కర్తవ్యంగా మార్చుకున్నానని తెలిపింది. మొత్తానికి ప్లాస్టిక్ సర్జరీలు తనలో ఉన్న బెస్ట్ వెర్షన్‌ను చూపించాయని అభిప్రాయపడింది కార్డి బీ.
తన హెయిర్ గురించి కూడా చుట్టుపక్కల బాయ్స్ కామెంట్ చేసేవారని.. సాఫ్ట్, కర్లీ, ప్రెట్టీ హెయిర్ ఎందుకు లేదని అడిగేవారని తెలిపింది. కాగా హెయిర్ డై యూజ్ చేయడం మొదలెట్టాక.. మంచి కాంప్లిమెంట్స్ అందాయని, కానీ ఈ పని చేయడం తనకు సిగ్గనిపించేదని తెలిపింది. దీంతో హెయిర్‌ను ఆరోగ్యంగా, అందంగా ఉంచేందుకు ఇంట్లోనే నేచురల్ ప్రొడక్ట్స్ తయారు చేసుకోవడం మొదలెట్టానని వెల్లడించింది. ‘నాపీగా ఉన్నందున నా జుట్టు చెడ్డది కాదు .. కేర్ తీసుకోలేకపోడం వల్లే నా జట్టు అలా ఉంది’ అని చెప్పింది.