ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ముగ్గురు మృతి

by srinivas |
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షత గాత్రులను ఏలూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా భీమవరంలో వివాహానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story