ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబు పేలుడు.. ఐదుగురి మృతి

by vinod kumar |
ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబు పేలుడు.. ఐదుగురి మృతి
X

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు పక్తియా ప్రావిన్స్‌లో గురువారం జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు మరణించగా, మరో 19 మంది గాయపడ్డారు. గార్దెజ్ పట్టణంలోని మిలటరీ కోర్టు ఎదురుగా పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కును పేల్చి వేశారు. ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారని.. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు నేషనల్ ఆర్మీకి చెందిన అధికార ప్రతినిధి తెలిపారు. గాయపడిన 19 మందిలో ఐదుగురు భద్రతా దళాలకు చెందిన సైనికులని వరు స్పష్టం చేశారు. పేలుడు పదార్థాలతో నింపిన మజ్దా ట్రక్కును గేటు ముందు నిలిపి ఇవాళ ఉదయం 8.30 గంటలకు డిటోనేటర్ సహాయంతో పేల్చేశారు. ఈ పేలుడుకి తామే బాధ్యలమని తాలిబాన్ ప్రకటించుకుంది. ఈ దాడిని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తీవ్రంగా ఖండించారు. ఇక రక్షణాత్మక వైఖరిని వీడి ఎదురు దాడి వ్యూహాన్ని అనుసరించాలని ఆయన భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేశారు. గత మూడు రోజులుగా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు వరుసగా దాడులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed