తాడేపల్లిలో దారుణం : స్నేహితుడిని బంధించి.. యువతిపై గ్యాంగ్ రేప్

by srinivas |
Gang rape
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణమ్మ సాక్షిగా.. పుష్కర ఘాట్‌లో యువతి దారుణంగా అత్యాచారానికి గురైంది. స్నేహితుడితో కలిసి ఉన్న ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వెంట ఉన్న స్నేహితుడిపై దాడి చేసి, కాళ్లు, చేతులు కట్టేసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. శనివారం అర్ధరాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్లపై జరిగిందీ దారుణ ఘటన.

అత్యాచారం అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులు పడవలో విజయవాడ వైపు పారిపోయినట్లు యువతి పేర్కొంటుంది. కీచకుల నుంచి బయటపడిన జంట.. ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. ఆ ఫోన్ వాయిస్ రికార్ట్‌తోనే ఘటన బయటకు పొక్కినట్లు తెలుస్తోంది. అనంతరం వారిద్దరు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో దాడి, అత్యాచారం ఘటపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్యపరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కొంతమంది స్థానిక యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story