గెజిట్ నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

by srinivas |
గెజిట్ నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆమోద ముద్ర వేయడం.. వెనువెంటనే ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ గెజిట్‌ను నిలిపివేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

రాజధాని పరిరక్షణ సమితి ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. జీఎన్‌రావు, హైపవర్ కమిటీలు చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషన్‌‌‌లో పేర్కొన్నారు. అలాగే సీఎం కార్యాలయం, సచివాలయం, రాజ్ భవన్ లను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story