షాకింగ్ న్యూస్.. మిరపతోటలో గంజాయి మొక్కలు

by Sumithra |
షాకింగ్ న్యూస్.. మిరపతోటలో గంజాయి మొక్కలు
X

దిశ, మరిపెడ: మిర్చి తోటలో గంజాయి మొక్కలను పోలీస్, రెవెన్యూ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట శివారు గ్రామ పరిధిలోని అజ్మీరా తండాలో మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. మరిపెడ సీఐ సాగర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని అజ్మీరా తండా శివారు మిర్చి తోటల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో అజ్మీరా హుస్సేన్, హర్కవత్ కిషన్ అను ఇరువురు తమ మిరప తోటల్లో అంతర పంటగా నిషేధిత గంజాయి మొక్కలు సాగు చేసినట్టు గుర్తించామన్నారు. ఇద్దరి మిరప తోటల్లో సుమారు 97 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకుని, తహసీల్దార్ రమేష్ బాబు పంచనామా ఆధారంగా ఇద్దరిపై ఎండీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో మరిపెడ ఎస్ఐ ప్రవీణ్, ఏఎస్ఐ కానిస్టేబుల్ ఈర్యా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed