ఆశ్చర్యం.. గవర్నమెంట్ హాస్పిటల్‌లో పెరిగిన గంజాయి మొక్కలు

by Sumithra |
ఆశ్చర్యం.. గవర్నమెంట్ హాస్పిటల్‌లో పెరిగిన గంజాయి మొక్కలు
X

దిశ, భువనగిరి రూరల్: భువనగిరి ప్రభుత్వ దవాఖానలో గంజాయి మొక్కలు కలకలం రేపాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో మార్చురీకి సమీపంలో ఏపుగా పెరిగిన నాలుగు గంజాయి మొక్కలను ఆసుపత్రికి వచ్చిన రోగుల బంధువులు సోమవారం రోజు మధ్యాహ్నం గుర్తించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించారు. ఆ సమాచారంతో మంగళవారం రోజు ఆబ్కారీ పోలీసులు రంగంలోకి దిగి మొక్కలను పరిశీలించి ఇవి గంజాయి మొక్కలే అని నిర్ధారించారు. అనంతరం గంజాయి అలవాటు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఆసుపత్రికి వచ్చి అక్కడ గంజాయి పడెయ్యడం ఈ మొక్కలు అక్కడ పెరిగి ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేసారు. కాగా, ఇంతకాలంగా మొక్కలు అక్కడే ఉన్నా అవి ఎవరి దృష్టికీ రాకపోవడం, ఉన్నవి గంజాయి మొక్కలని ఇప్పుడు తెలిసి రావడం స్థానికుల్ని అబ్బురపర్చింది. భువనగిరి పట్టణంలో నడిబొడ్డున గంజాయి మొక్కలు ఎలా పెరిగాయి. ఇంతగా పెరిగే వరకు ఎవరు చూడకుండా ఉన్నారా. లేక తెలిసినా కొందరు చెప్పకుండా ఉన్నారా అనే సందేహాలను సైతం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed