- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మత్తు’కు కేరాఫ్‌గా ఓరుగల్లు.. 50 కేజీల గంజాయి పట్టివేత
దిశ, కొత్తగూడ : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా గంజాయి రవాణా మాత్రం ఆగడం లేదు. గుట్టుగా అది చేరాల్సిన చోటుకు చేరిపోతోంది. ఇటీవల నర్సంపేట డివిజన్‌లోని నల్లబెల్లి, ఖానాపూర్ మండలాల్లో గంజాయి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలు మరువక ముందే తాజాగా కొత్తగూడ మండలంలో మరోసారి గంజాయి కలకలం రేపింది. ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న వారిని ఆపి సోదా చేయడంతో గంజాయి పట్టుబడింది. ఈ ఘటన కొత్తగూడ మండలంలోని మైలారం తండా సమీపంలో సోమవారం వెలుగుచూసింది.
ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం.. మండలంలోని మైలారం తండా వైపుగా ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు బ్యాగులతో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. అటుగా వెళ్తున్న పోలీసులు వారిని వెంబడించి స్థానికుల సాయంతో పట్టుకున్నారు. ఇద్దరిలో ఒకరు పారిపోగా, ఒకరు పోలీసుల చేతికి చిక్కాడు. అతని నుంచి సుమారు 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై కొత్తగూడ ఎస్సై అజ్మీర సురేష్‌ను వివరణ కోరగా గంజాయి పట్టుబడిన విషయం నిజమేనని, వారు మహారాష్ట్రకు చెందిన వ్యక్తులుగా అనుమానిస్తున్నట్టు తెలిపారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు సాయంత్రం తెలియజేస్తామన్నారు.