- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పు చెల్లిస్తామని పిలిచి.. పాతిపెట్టారు..
దిశ ప్రతినిధి, మెదక్ : అప్పు తీసుకున్న డబ్బులు చెల్లిస్తామని నమ్మించి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి పాతిపెట్టిన సంఘటన సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఓ ఫామ్ హౌస్‌లో పాతిపెట్టిన శవాన్ని పోలీసులు వెలికి తీసి విచారణ చేపట్టారు. హతుడు సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామానికి చెందిన ఎడ్ల మధుసూదన్ రెడ్డి గా గుర్తించారు. మధుసూదన్ రెడ్డి ఓ హత్య కేసులో నిందితుడు కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ఎడ్ల మధుసూదన్ రెడ్డి హత్యకు డబ్బుల వ్యవహారమే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కర్ణాటక కు చెందిన సంజీవ్, అతని అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మధుసూదన్ రెడ్డి గతంలో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లగా, జైల్లో కర్ణాటక కు చెందిన సంజీవ్ పరిచయం అయినట్లు తెలుస్తోంది.
జైలు నుండి విడుదల అయిన అనంతరం వీరిద్దరు కలిసి హైదరాబాద్ లో వ్యాపారం చేశారు. వ్యాపారంలో మధుసూదన్ రెడ్డి కి సంజీవ్ రూ.45 లక్షలు బాకీ పడ్డాడు. డబ్బు విషయమై పలు మార్లు ఇరువురి కి తగాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ నాడు డబ్బులు ఇస్తానని మధుసూదన్ కు సంజీవ్ ఫోన్ చేసి చెప్పాడు. డబ్బు తెచ్చుకునేందుకు వెళ్లిన మధుసూదన్ ను సంజీవ్ తన కారు లో తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం మధు సుధన్ రెడ్డి డెడ్ బాడీని కొహీర్ మండల పరిధిలోని దిగ్వాల్ గ్రామం శివారులోని చైతన్య ఫామ్ హౌస్ వెనకాల కాల్వలో పాతి పెట్టాడు. మధు సూదన్ రెడ్డి తిరిగి రాకపోవడం, ఫోన్ కలవక పోవడం తో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఈ నెల 20వ తేదీ నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ కాల్ డాటా ఆధారంగా సంజీవ్ ను అరెస్ట్ చేసి పాతి పెట్టిన మధు సుధన్ రెడ్డి శవంను వెలికి తీసి, సంఘటన స్థలం లోనే పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని బంధువులకు అప్పగించారు.