భారత ప్రభుత్వంపై కేసులను ఉపసంహరించనున్న కెయిర్న్ ఎనర్జీ!

by Harish |
భారత ప్రభుత్వంపై కేసులను ఉపసంహరించనున్న కెయిర్న్ ఎనర్జీ!
X

దిశ, వెబ్‌డెస్క్: రెట్రో స్పెక్టివ్ పన్ను వివాదానికి సంబంధించి భారత ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు వేసిన అన్ని కేసులను ఉపసంహరించుకుంటున్నట్టు కెయిర్న్ ఎనర్జీ బుధవారం ప్రకటించింది. దీనికి సంబంధించి భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం కెయిర్న్ ఎనర్జీకి రూ.7,900 కోట్లను రిఫండ్ చేయనుంది. కెయిర్న్, వొడాఫోన్ పీఎల్‌సీ లాంటి బహుళజాతి సంస్థలతో భారత్‌కు ఉన్న 17 పన్ను వివాదాలను పరిష్కరించేందుకు ఈ ఏడాది కేంద్రం ప‌న్ను చ‌ట్టాల(స‌వ‌ర‌ణ) బిల్లు ప్రవేశపెట్టింది.

పరిష్కార షరతులను దృష్టిలో ఉంచుకుని భారత ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం అవసరమైన డాక్యుమెంటేషన్ దాఖలు చేస్తామని కెయిర్న్ ఎనర్జీ పేర్కొంది. ‘పన్ను సవరణ చట్టం నిబంధనల ప్రక్రియలో భాగంగా రిఫండ్‌ను వేగవంతం చేసేందుకు తాము భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని’ కంపెని ఓ ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

Next Story