- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ నుంచి వచ్చే పన్ను వాపసుతో షేర్ల బైబ్యాక్: కెయిర్న్ ఎనర్జీ!
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వం నుంచి వచ్చిన 1 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7,500 కోట్ల) విలువైన వాపసు పన్ను మొత్తాన్ని షేర్ల బైబ్యాక్ కోసం ఉపయోగించనున్నట్టు కెయిర్న్ ఎనర్జీ సంస్థ వెల్లడించింది. భారత్ నుంచి వచ్చే ఈ పన్ను వాపసులో భాగంగా 20 మిలియన్ డాలర్ల(రూ. 148 కోట్ల)తో ముందుగా సాధారణ వాటాలను కొనుగోలు చేసినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. “దీనికి సంబంధించిన వ్యవహారాలను ప్రముఖ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ నిర్వహిస్తుందని, ఈ కంపెనీ నుంచి తనకు షేర్లు బదిలీ కానున్నట్టు”కెయిర్న్ సంస్థ వివరించింది.
కాగా, 2006లో కెయిర్న్ కంపెనీ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణ గురించి వివరాల కోసం అప్పట్లో కేంద్ర పన్నుల విభాగం నోటీసులు ఇచ్చింది. వాటిపై 2015లో రూ. 10,247 కోట్ల పన్నులు చెల్లించాల్సి ఉంటుందని, పునర్‌వ్యవస్థీకరణ ద్వారా మూలధన రాబడిపై పన్ను చెల్లించాలని ఐటీ విభాగం కోరింది. అయితే, 2010-11 ఆర్థిక సంవత్సరంలో కెయిర్న్ కంపెనీ దాని భారత విభాగాన్ని వేదాంత సంస్థకు విక్రయించింది. ఈ ఒప్పందంలో భాగంగా కెయిర్న్ ఎనర్జీకి చెందిన ఐదు శాతం వాటాను కూడా వేదాంతకు ఇచ్చింది. ఈ షేర్లను కూడా పన్నుల శాఖ జత చేసింది. అంతేకాకుండా రూ. 1,590 కోట్ల ట్యాక్స్ రీఫండ్, రూ. 1,140 కోట్ల డివిడెండ్లను ఇవ్వలేదు. దీనిపై కోర్టుకెళ్లిన కెయిర్న్ ఎనర్జీకి తర్వాతి పరిణామాల్లో సానుకూల తీర్పు వచ్చింది.