మే చివరినాటికి ఢిల్లీలో 44 ఆక్సిజన్ ప్లాంట్లు

by Shamantha N |
మే చివరినాటికి ఢిల్లీలో 44 ఆక్సిజన్ ప్లాంట్లు
X

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రాణ వాయువు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ‘ఊపిరి’ పోసే వార్త చెప్పారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. వచ్చే నెల చివరి నాటికి ఢిల్లీలో 44 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుచేయనున్నట్టు ఆయన తెలిపారు. మంగళవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేజ్రీవాల్.. మే చివరినాటికి వివిధ ఆస్పత్రుల వద్దే 44 ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పనున్నామని అన్నారు. ఇందులో 8 ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండగా.. 18 ట్యాంకర్లను థాయ్‌లాండ్ నుంచి దిగుమతి చేసుకోనున్నట్టు చెప్పారు. అంతేగాక ఫ్రాన్స్ నుంచి వాడకానికి సిద్ధంగా ఉన్న (రెడీ టూ యూజ్) 21 ఆక్సిజన్ ప్లాంట్లూ త్వరలోనే దిగుమతి కానున్నాయని అన్నారు.

కాగా థాయ్‌లాండ్ నుంచి దిగుమతి చేసుకునే ప్లాంట్ల కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలను అందించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బ్యాంకాక్ నుంచి రానున్న ట్యాంకర్లు.. బుధవారం ఢిల్లీకి చేరుకుంటాయి. పదిరోజుల క్రితం తీవ్ర ఆక్సిజన్ కొరత ఎదుర్కొన్న ఢిల్లీలో పరిస్థితులు ఇప్పుడు కొంచెం కుదుటపడ్డాయని సీఎం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తు్న్న సాయానికి కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed