జొమాటో కొత్త ఫీచర్.. వావ్ అంటున్న కస్టమర్లు

by M.Rajitha |
జొమాటో కొత్త ఫీచర్.. వావ్ అంటున్న కస్టమర్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో కస్టమర్ల అవసరాలను తీర్చే ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్ జొమాటో.. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది. ఇక నుండి కస్టమర్లు వారి ఆర్డర్లను ముందుగానే బుక్ చేసుకునేందుకు 'ఆర్డర్ షెడ్యూలింగ్' ను ప్రవేశ పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రెండు రోజుల ముందుగానే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. వాటిని వారు షెడ్యూల్ చేసిన టైంకి డెలివరీ పార్టనర్స్ అందజేస్తారు. అయితే రూ.1000 కంటే ఎక్కువ మొత్తంలో ఆర్డర్ చేసుకోవడానికి వీలుంది. ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, చండీగఢ్, లఖన్ పూ, బెంగుళూర్, అహ్మదాబాద్ నగరాల్లో 13 వేల అవుట్ లెట్స్ లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. త్వరలోనే అన్ని నగరాలకు ఈ సౌకర్యాన్ని విస్తరిస్తామని వెల్లడించారు.

Next Story

Most Viewed