- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Zomato: జొమాటోలో ఈ ఏడాది ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) 2024 ఏడాదికి సంబంధించి ఎక్కువ ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెమ్స్(Food Items) జాబితాను తాజాగా విడుదల చేసింది. జొమాటో వార్షిక నివేదిక ప్రకారం.. ఈ ఏడాది వారి ప్లాట్‌ఫామ్ ద్వారా డెలివరీ అయిన ఫుడ్‌లో బిర్యానీ(Biryani) అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది 9 కోట్ల బిర్యానీ ఆర్డర్లు(Orders) వచ్చాయని, సెకనుకు సగటున మూడు బిర్యానీలు డెలివరీ అయినట్లు సంస్థ పేర్కొంది. దీంతో వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా బిర్యానీ ఫస్ట్ ప్లేసులో నిలిచింది. ఇక బిర్యానీ తర్వాత పిజ్జా(Pizza) అత్యధిక ఆర్డర్లు పొందిన ఐటెంగా రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 5.84 కోట్ల పిజ్జాలు డెలివరీ అయినట్లు నివేదిక తెలిపింది. అలాగే 77 లక్షల కప్పుల టీ(Tea), 74 లక్షల కప్పుల కాఫీ(Coffee) జొమాటో ద్వారా డెలివరీ చేసినట్లు పేర్కొన్నారు. ఇక బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఓ రెస్టారెంట్‌లో ఏకంగా రూ. 5.13 లక్షల బిల్లు పే(Bill Pay) చేసాడని, డైనింగ్ సర్వీసుల్లో ఈ స్థాయిలో బిల్లు పే చేయడం ఇదే మొదటిసారని నివేదికలో వెల్లడించారు.