X Premium Plus: ఎక్స్ యూజర్లకు బిగ్ షాక్.. ప్రీమియం ప్లస్ ఛార్జీలు భారీగా పెంపు..!

by Maddikunta Saikiran |
X Premium Plus: ఎక్స్ యూజర్లకు బిగ్ షాక్.. ప్రీమియం ప్లస్ ఛార్జీలు భారీగా పెంపు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుడు టెస్లా(Tesla), స్పేస్ ఎక్స్(Space x) సంస్థల అధినేత ఎలాన్ మస్క్(Elon Musk)కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(X) తమ యూజర్లకు యాడ్‌ ఫ్రీ కంటెంట్‌ అందించడానికి ప్రీమియం ప్లస్(Premium Plus) ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారు ఎక్స్ లో కంటెంట్(Content)ను ఎలాంటి యాడ్స్ లేకుండా చూడొచ్చు. అలాగే కంటెంట్ క్రియేటర్లు డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. ఇదిలా ఉంటే ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ధరలను 40 శాతం పెంచుతూ ఎక్స్ నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ మార్కెట్ల(Global Market)తో పాటు ఇండియా(India)లోనూ ఈ ధరల పెంపు ఉంటుందని తెలిపింది. పెరిగిన ధరలు డిసెంబర్ 21 నుంచి అమలులోకి వస్తాయని ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఇండియాలో ఎక్స్ ప్రీమియం ప్లస్ ధరలు మరింత ప్రియం కానున్నాయి. కాగా ప్రస్తుతం భారత్‌లో ఎక్స్ ప్రీమియం ప్లస్ ధర నెలకు ధర రూ.1,300 ఉండగా.. ఇకనుంచి నెలకు రూ.1,750 చెల్లించాల్సి ఉంటుంది. అంటే యూజర్లు ఇకపై ఏడాదికి రూ.18,300 చెల్లించాలి. అయితే 2025 జనవరి 21వ తేదీ కంటే ముందే సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి పాత ధరలకే ప్రీమియం ప్లస్ సేవలు అందనున్నాయని ఎక్స్ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed