- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X-Mail: గూగుల్‌కు ఎలాన్ మస్క్ బిగ్ షాక్.. జీ మెయిల్ కు పోటీగా ఎక్స్ మెయిల్..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుడు టెస్లా(Tesla), స్పేస్ ఎక్స్(Space X) సంస్థల అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గూగుల్(Google)కు చెందిన జీ మెయిల్(G-Mail)కు చెక్ పెట్టేందుకు త్వరలో ఎక్స్ మెయిల్(X-Mail)ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. యూజర్లకు మరింత సౌకర్యాన్ని ఇచేలా దీన్ని రూపొందిస్తామని, ఎక్స్ మెయిల్ లో సంప్రదాయ మెయిల్స్‌లా కాకుండా మెసేజింగ్‌కు వాడుతున్న చాటింగ్ ఫార్మాట్‌లో మెయిల్స్ ఉంటాయని వెల్లడించారు. ఇందులో చాలా సింపుల్ డిజైన్‌తో అందరికీ సులువుగా అర్థమయ్యేలా మెయిల్స్ ఉంటాయని, మెసేజింగ్ /ఈ- మెయిలింగ్ వంటి వాటన్నింటిపై మనం పునరాలోచించాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు. ఎక్స్(X) వేదికగా ఓ యూజర్ ఎక్స్.కామ్ ఈ-మెయిల్ ఒకటే నన్ను జీమెయిల్ యూజ్ చేయకుండా ఆపగలదని ట్వీట్ చేశాడు. దీనికి ఎలాన్ మస్క్ రిప్లై ఇస్తూ.. మెసెజింగ్ మీదనే మనం మొత్తం ఆలోచన చేయాల్సి ఉందని, అందులో ఈమెయిల్‌తో పాటు అన్ని మెసెజింగ్ వ్యవస్థలపైనా చర్చించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. కాగా ఎక్స్ మెయిల్ అందుబాటలోకి వస్తే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.