ఒకరికి సెండ్ చేసే మనీ మరొకరికి పంపించారా? ఇలా చేస్తే వెంటనే తిరిగి పొందొచ్చు..

by Nagaya |   ( Updated:2023-03-28 12:45:12.0  )
ఒకరికి సెండ్ చేసే మనీ మరొకరికి పంపించారా? ఇలా చేస్తే వెంటనే తిరిగి పొందొచ్చు..
X

దిశ, ఫీచర్స్: ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఒకరికి పంపించే డబ్బులు మరొకరికి సెండ్ చేశారా? అసలే డబ్బులు లేవంటే ఇలా జరిగిందేంటి? అని బాధపడుతున్నారా? అయితే ఇలాంటి రాంగ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ సొల్యూషన్ తీసుకొచ్చింది. ‘ఆర్‌బీఐ వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్’ స్కీమ్‌ ద్వారా ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తోంది. ఈ స్కీమ్ 2021లోనే అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా మందికి అవగాహన లేదు.

ఈ స్కీమ్ కింద మనీ లాస్ అయిన వ్యక్తి నాలుగు మార్గాల్లో కంప్లయింట్ ఫైల్ చేయొచ్చు.

1. ఏ యూపీఐ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేశారో ఆ యూపీఐ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.

2. వారి నుంచి రెస్పాన్స్ రాకపోతే టోల్ ఫ్రీ నంబర్ 14448(9:30 am to 5:15 pm)కి కాల్ చేసి ఏ భాషలో అయినా కంప్లయింట్ చేయవచ్చు.

3. [email protected]కు మెయిల్ సెండ్ చేసి లేదంటే ‘https://cms.rbi.org.in’ వెబ్‌సైట్ ద్వారా కూడా కంప్లయింట్ చేసి పరిష్కారాన్ని పొందొచ్చు.

4. సెంట్రలైజ్డ్ రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4వ అంతస్తు, సెక్టార్ 17, చండీగఢ్, 160017 చిరునామాకు లెటర్ ద్వారా ఫిర్యాదు చేయండి.

ఇక కస్టమర్‌లు దాఖలు చేసిన ఫిర్యాదులకు సంబంధించి సమాచారాన్ని అందించే బాధ్యత ప్రభుత్వ రంగ బ్యాంక్ లేదా తత్సమాన జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్‌పై ఉంటుంది. RBI కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ పథకం కింద అప్పీలేట్ అథారిటీగా ఉంటారు.

Read more:

ఫోన్‌పే, గూగుల్ పే వాడే వారికి షాక్.. కేంద్రం కీలక నిర్ణయం

Advertisement

Next Story

Most Viewed