ఈ ఏడాది భారత్ మాత్రమే అత్యధిక వృద్ధి సాధిస్తుంది: WEFప్రెసిడెంట్!

by Harish |
ఈ ఏడాది భారత్ మాత్రమే అత్యధిక వృద్ధి సాధిస్తుంది: WEFప్రెసిడెంట్!
X

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ మాత్రమే ఈ ఏడాది అత్యధిక వృద్ధిని సాధిస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు బొర్గె బ్రెండె అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా వృద్ధి చెందుతోందని, దానివల్ల గణనీయమైన పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. తద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆయన ఓ ప్రకటనలో చెప్పారు.

భారత పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులతో చర్చించిన అనంతరం ఆయన భారత వృద్ధిపై స్పందించారు. రానున్న కొన్నేళ్లలో భారత్ విపరీతమైన వృద్ధిని కలిగి ఉంటుంది. వ్యాపారాలకు అనుమతులివ్వడంలో జాప్యాన్ని తగ్గించేందుకు భారత అనేక సంస్కరణలు చేపట్టింది. దాంతో పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతాయి. దీనికి డిజిటల్ విప్లవం సహాయపడుతుంది.

ఈ క్రమంలో దేశంలో పేదరికం తగ్గే పరిస్థితులు చూడవచ్చు. యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఢిల్లీలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కంటే అత్యధికంగా భారత్‌లో స్టార్టప్‌లు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడుల ద్వారా అవకాశాలు ఊపందుకుంటాయని బొర్గె పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed