- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సమ్మెకు దిగిన యాపిల్ ఉద్యోగులు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తమిళనాడులోని యాపిల్ సరఫరా కంపెనీ ఫ్లెక్స్ తయారీ ప్లాంటులో ఉద్యోగులు నిరసనకు దిగారు. కార్మికుల వేతనాలు పెంచాలని, యూనియన్ ఏర్పాటును గుర్తించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఒకరోజు సమ్మె చేశారు. ఫాక్స్‌కాన్, పెగాట్రాన్‌తో సహా దేశంలోని చాలా ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో యూనియన్ లేదు. ఆటోమొబైల్ ఫ్యాక్టరీలు మెరుగైన ఆర్గనైజింగ్ కలిగి ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. యాపిల్ సరఫరాదారు ఫ్లెక్స్‌లో టూర్ అలవెన్సులు, మెడికల్ లీవ్స్ సహా వేతనాలు, విధానాల విషయంలో అసంతృప్తి ఉందని, దాదాపు 750 మంది పర్మినెంట్ కార్మికులందరూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్‌లో చేరారని యూనియన్ కార్యదర్శి ఇ ముత్తుకుమార్ తెలిపారు. యాపిల్‌కు చెందిన ఛార్జర్లను తయారు చేసే ఫ్లెక్స్ ప్లాంటులో యూనియన్ ఏర్పాటును కంపెనీ ఇష్టపడటంలేదు. ఈ ప్లాంటులో సమ్మెలో చేరని కాంట్రాక్టర్లతో కలిసి దాదాపు 4,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంటి అద్దెలు, విద్య ఫీజులు, ఇతర ఖర్చులు పెరిగినందున, ప్రస్తుత జీతంతో జీవనోపాధి కొనసాగడం సాధ్యం కాదు. వచ్చే మూడేళ్ల పాటు వేతనాలు పెంచాలని కార్మికులు కోరినప్పటికీ కంపెనీ దాన్ని పరిగణించలేదు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఫ్లెక్స్ కంపెనీ స్పందించలేదు. ఇదివరకు యాపిల్ ఇతర సరఫరాదారులైన విస్ట్రాన్‌లో సైతం కార్మికులు వేతనాల కోసం నిరసన వ్యక్తం చేశారు. ఫాక్స్‌కాన్‌లో కార్మికులు ఫుడ్ పాయిజన్ కారణంగా సమ్మెకు దిగారు.