త్వరలో అందుబాటులోకి రానున్న BSNL స్వదేశీ 4G సేవలు!

by Harish |
త్వరలో అందుబాటులోకి రానున్న BSNL స్వదేశీ 4G సేవలు!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందించేందుకు సన్నద్ధమవుతోందని, త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని కమ్యూనికేషన్ సహాయ మంత్రి దేవుసిన్ చౌహాన్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. వీలైనంత త్వరగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందించడానికి పనులు జరుగుతున్నాయని, లక్ష బీఎస్ఎన్ఎల్ 4జీ సైట్‌ల విస్తరణకు మంత్రుల బృందం ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఈ సేవలు దేశీయ టెక్నాలజీతో వస్తోందని, అందుకే ఆలస్యమైందన్నారు.

ఇక, ప్రభుత్వ ఈ-కామర్స్ ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్‌డీసీ)తో భాగస్వామ్యం కోసం ఇండియా పోస్ట్ ప్రయత్నిస్తోందని మంత్రి చెప్పారు. ఇండియా పోస్ట్‌తో భాగస్వామ్యం ద్వారా చిన్న వ్యాపారాలకు ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే, నకిలీ కాల్స్ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన కృషి జరుగుతోందని పేర్కొన్నారు. దేశంలో 5జీ నెట్‌వర్క్ సేవలు సంతృప్తిగా ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా మరే దేశం కూడా సాధించలేని వేగవంతమైన 5జీ ఇంటర్నెట్ స్పీడ్ మన దేశంలో 800 జిల్లాలకు విస్తరించిందని మంత్రి వెల్లడించారు.

Advertisement

Next Story