- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Whatsapp: వాట్సాప్ కు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ సేవలపై లిమిట్ ఎత్తివేత..!
దిశ, వెబ్‌డెస్క్: మెటాకు(Meta) చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్(Whatsapp) ఫోన్ పే, గూగుల్ పే లకు పోటీగా 2020లో పేమెంట్ సేవల్ని(Payment Services) అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ఈ సేవలపై ఆంక్షలు(Sanctions) విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలుత 4 కోట్ల మందికే ఈ సేవల్ని పరిమితం చేయాలని వాట్సాప్ ను ఆదేశించింది. మళ్లీ 2022లో ఆ సంఖ్యను 10 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపింది. తాజాగా వాట్సాప్ పేమెంట్ సర్వీసులపై లిమిట్ ఎత్తివేస్తున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రకటించింది. దీంతో ఇండియాలో ఉన్న యూజర్లందరికీ వాట్సాప్ పేమెంట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 10 కోట్ల మందే పేమెంట్ సేవల్ని వాడుకునే అవకాశం ఉండగా.. త్వరలోనే అందరూ ఈ సదుపాయాన్ని యూజ్ చేసుకోవచ్చు. కాగా వాట్సాప్ కు మన ఇండియాలో 50 కోట్ల వరకు యూజర్లు ఉన్నారు.