ఇండియా మార్కెట్లోకి టెస్లాకు స్వాగతం: MG మోటార్ ఇండియా

by Disha Web Desk 17 |
ఇండియా మార్కెట్లోకి టెస్లాకు స్వాగతం: MG మోటార్ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈవీ మార్కెట్లోకి ప్రవేశించాలని చూస్తోన్న ఎలాన్‌మస్క్‌‌కు చెందిన టెస్లా నిర్ణయాన్ని MG మోటార్ ఇండియా సీఈఓ రాజీవ్ చాబా స్వాగతించారు. టెస్లా భారత్‌లోకి అడుగుపెట్టడం ద్వారా ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని, మరిన్ని ఈవీ కంపెనీలు సైతం దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వీలవుతుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి 30 శాతం ఈవీ అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనిని సాధించడం ప్రస్తుతం సవాలుగా ఉంది. అయినప్పటికీ కూడా విదేశీ ఈవీ తయారీదారులను ఆకర్షించడం ద్వారా ఈ లక్ష్యంలో దాదాపు 20 శాతం కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేయవచ్చని రాజీవ్ చాబా ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలకు గమ్యస్థానంగా మారుతుంది. ఎక్కువ పెట్టుబడులు రావడానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. టెస్లా ప్రవేశించడం ద్వారా ఇది భారత్‌లో పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సహాయం చేస్తుంది. కొంతమంది వినియోగదారులు అయిన ఈవీ కార్లకు మారతారు. దీని వలన పర్యావరణానికి మేలు కలుగుతుంది. ప్రజలకు ఈవీల పట్ల ఉన్న అపోహలను తొలగించడానికి టెస్లా ఉపయోగపడుతుందని రాజీవ్ అన్నారు..

దీని రాక ఈవీ పరిశ్రమకు సానుకూల ప్రభావాన్ని అందిస్తుంది, మరిన్ని కంపెనీలు భారత్‌లోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నామని రాజీవ్ చాబా తెలిపారు. అలాగే, చార్జింగ్ సెంటర్లు తక్కువగా ఉండటం వలన భారతదేశంలో ఈవీల డిమాండ్ తగ్గుతుందని చాబా హెచ్చరించారు. దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయడం ద్వారా భారత్‌లో ఈవీల ప్రాముఖ్యత రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని సీఈఓ రాజీవ్ అన్నారు.



Next Story

Most Viewed