- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హాస్పిటల్ బెడ్‌పై యంగ్ హీరోయిన్.. చాలా కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్.. అయోమయంలో ఫ్యాన్స్
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ దక్ష నాగర్కర్ భూగత సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. తెలుగులో ఈ అమ్మడు ఏకే రావు పీకే రావు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత నాగచైతన్య బంగార్రాజు, హుజారు, రావణాసుర, జాంబీ రెడ్డి వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో.. దక్ష తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పలు ఫొటోలు షేర్ చేసి షాకిచ్చింది. తాను గత కొద్ది రోజుల నుంచి హీస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
కానీ అసలు ఆమెకు ఏమైంది ఎందుకు సర్జరీలు అయ్యాయి అనే విషయం మాత్రం బయటపెట్టలేదు. దక్ష సెలైన్ ఎక్కించుకుంటున్న పిక్ షేర్ చేస్తూ.. ‘‘గత కొన్ని రోజులుగా స్ట్రెచర్‌పై నాకు తెలియని వ్యక్తులతో సర్జరీ గదిలో ఉండడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అనస్థీషియాతో నా వెన్నెముకపై రెండు సార్లు పొడిచి వేయడంతో చాలా కష్టంగా ఉంది. కోలుకోవడం మరింత కష్టమైంది. నేను నా ఎమోషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాను. నన్ను ప్రేమించే వ్యక్తులు నాకు సపోర్ట్‌గా నిలిచారు.
ఇలాంటి సమయంలో మనిషిని ఎలా ప్రేమించాలో చూపించారు. ప్రేమ కేరింగ్ కి కనిపించని గాయాలను నయం చేసే శక్తి ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మరీ ముఖ్యంగా మిమ్మల్ని బేషరతుగా ప్రేమించే సరైన వ్యక్తులను కలిగి ఉండండి. సంతోషకరమైన భాగాలను మాత్రమే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఎవరూ బాధపడాలని నేను కోరుకోను’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా కంగారు పడుతున్నారు. దక్షకు ఏమైంది అసలు ఎందుకు హాస్పిటల్‌లో ఉందని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.