Waaree Energies: స్టాక్ మార్కెట్లోకి వారీ ఎనర్జీస్ గ్రాండ్ ఎంట్రీ.. మొదటి రోజే ఒక్కో షేరుపై రూ. 1000 లాభం..!

by Maddikunta Saikiran |
Waaree Energies: స్టాక్ మార్కెట్లోకి వారీ ఎనర్జీస్ గ్రాండ్ ఎంట్రీ.. మొదటి రోజే ఒక్కో షేరుపై రూ. 1000 లాభం..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సోలార్ ప్యానెళ్ల(Solar Panels) తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్ లిమిటెడ్(Waaree Energies Limited) స్టాక్ మార్కెట్ నిపుణులు ఊహించినట్లుగానే దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లోకి తొలి రోజే అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో సుమారు 70 శాతం ప్రీమియంతో నమోదైంది. దీంతో ఐపీఓ(IPO)లో ఈ సంస్థ షేర్లు అలాట్ అయినా వారికి కాసుల పంట పండింది. కాగా ఐపీఓ ద్వారా ఆ సంస్థ రూ. 4321 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సబ్ స్క్రిప్షన్ ఈ నెల 21న మొదలై 23న ముగిసింది. ఒక్కో షేర్ ధరను సంస్థ గరిష్టంగా రూ. 1503గా నిర్ణయించింది.

ఇదిలా ఉంటే సోమవరాం రోజున నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(NSE)లో ఈ కంపెనీ షేర్లు 66.33 శాతం ప్రీమియంతో రూ. 2500 వద్ద లిస్టింగ్ అయ్యాయి. ఇక బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ(BSE)లో అయితే ఈ స్టాక్ ఏకంగా 69.66 శాతం లాభంతో రూ. 2,550 వద్ద లిస్టింగ్ అయింది. చివరికి 72.98 శాతంతో రూ. 2,660 వరకు దూసుకెళ్లింది. దీంతో సంస్థ మార్కెట్ వాల్యూ(Market Value) 67,866 కోట్లకు చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర రూ. 2,345 వద్ద ట్రేడవుతోంది.

Advertisement

Next Story

Most Viewed