- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2024 నాటికి దేశవ్యాప్తంగా వోల్వో పాత కార్ల డీలర్‌షిప్ విస్తరణ!
న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా తన పాత కార్ల వ్యాపారాన్ని దేవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. 2024 ప్రారంభం నాటికి తన సర్టిఫైడ్ యూజ్‌డ్ కార్ బిజినెస్‌ను పాన్-ఇండియాలో విస్తరించనున్నట్టు కంపనీ ఓ ప్రకటనలో తెలిపింది. తద్వారా ఈ విభాగంలో మూడింట ఒక వంతు ఆర్డర్లు నమోదవుతాయని ఆశిస్తున్నట్టు కంపెనీ ఉన్నతాధికారి చెప్పారు. వోల్వో సంస్థ తన పాత కార్ల వ్యాపారాన్ని గ్లోబల్ మార్కెట్లలో 'సెలెక్ట్' ప్లాట్‌ఫామ్ కింద నిర్వహిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో కేవల రెండు డీలర్‌షిప్‌లను కలిగి ఉంది.
దేశీయంగా పెరుగుతున్న కార్ల వినియోగం, ముఖ్యంగా యూజ్‌డ్ కార్ల మార్కెట్ వృద్ధిని పరిగణలోకి తీసుకుని విస్తరణను వేగవంతం చేయనున్నట్టు వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా అన్నారు. తాజా అధ్యయనం ప్రకారం, దేశీయంగా యూజ్‌డ్ కార్ల మార్కెట్ 2027 నాటికి 19.5 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తుందని, మొత్తం 80 లక్షల ప్రీ-ఓన్‌డ్ కార్లు ఉంటాయని అంచనా. ప్రస్తుతం భారత్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా రెండు యూజ్‌డ్ కార్ డీలర్‌షిప్‌లను నిర్వహిస్తున్నాం. దశలవారీగా దీన్ని విస్తరించనున్నాం. 2023 లేదా 2024 నాటికి దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉండేలా ప్రణాళిక కలిగి ఉన్నామని జ్యోతి మల్హోత్రా వెల్లాడించారు.