జియో, ఎయిర్‌టెల్ బాటలోనే వొడాఫోన్ ఐడియా!.. 5 జీ డేటాపై మరో నిబంధన

by Ramesh Goud |
జియో, ఎయిర్‌టెల్ బాటలోనే వొడాఫోన్ ఐడియా!.. 5 జీ డేటాపై మరో నిబంధన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియాలో ప్రముఖ టెలికాం కంపెనీలు వరుసగా టారిఫ్ ల ధరలు పెంచుతూ.. వినియోగదారులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు తమ టారిఫ్ ల ధరలు పెంచగా.. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా అదే బాట పట్టింది. వొడాఫోన్ ఐడియా తమ కంపెనీ అందించే అన్ని రకాల టారిఫ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు వ్యాలిడిటీని బట్టి 10-21 శాతం పెరిగాయి. సవరించిన ధరలు జూలై 4 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సంస్థ తెలిపింది. ఈ లోపు రిచార్జ్ చేసుకునే వారికి పాత ధరలే వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీంతో వొడాఫోన్ ఐడియా 28 రోజుల కనీస ప్లాన్ ధర రూ.179 నుంచి రూ.199 కి చేరింది. ఇక జియో, ఎయిర్‌టెల్ సంస్థలు కొత్త నిబంధనలు తెచ్చి వినియోగదారులపై మరింత భారం మోపనున్నాయి. ఇప్పటివరకు కనీస రీఛార్జి ప్యాకేజీలపై 5 జీ డేటాను ఉచితంగా, అపరిమితంగా ఇచ్చిన కంపెనీలు.. ఇకపై 2 జీబీ కంటే ఎక్కువ రీచార్జ్ చేస్తేనే అపరిమిత 5 జీ సేవలు అందిస్తామని ప్రకటించాయి. దీంతో 5 జీ ఫోన్ ఉండి అపరిమిత డేటాను ఆనందించాలనుకునే జియో, ఎయిర్‌టెల్ కస్టమర్లు ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది.

Next Story

Most Viewed