- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు వొడాఫోన్ ఐడియా అదనపు డేటా
దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక కష్టాల్లో ఉన్న టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా కస్టమర్లను ఆకర్షించేందుకు మొదటిసారిగా వీఐ నెట్‌వర్క్‌లో 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అదనపు డేటాను అందిస్తోంది. ప్రీపెయిడ్ వినియోగదారులకు 'వీఐ గ్యారెంటీ ప్రోగ్రామ్'ను సోమవారం కంపెనీ ప్రకటించింది. దీని ద్వారా 5జీ, 5జీ ఫోన్ వినియోగదారులకు 130జీబీ డేటా లభిస్తుంది. ఈ అదనపు డేటా పూర్తిగా ఏడాది పాటు లభిస్తుంది. 13 వరుస సైకిళ్లలో ప్రతి నెల 28వ రోజు ఆటోమెటిక్‌గా 10జీబీ డేటా సబ్‌స్క్రైబర్లకు యాడ్ అవుతుంది. 'వినియోగదారులకు అంతరాయం లేని హై-స్పీడ్ డేటా ఎక్స్‌పీరియన్స్ అందించడం ద్వారా పెరుగుతున్న ఇంటర్నెట్ డిమాండ్‌ను తీర్చేందుకే ఈ కార్యక్రమం రూపొందించామని' వీఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా చెప్పారు. దేశంలో చాలామంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తగినంత డేటా లేకపోవడం వల్లనే వారి 4జీ, 5జీ మొబైల్‌ఫోన్ సామర్థ్యాన్ని పెంచుకోవడంలేదు. మేము తెచ్చిన ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లు తమ రోజువారీ కోటా అయిపోయిన తర్వాత కూడా కంటెంట్ కోసం డేటా ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు. ఈ ఆఫర్ 5జీ స్మార్ట్‌ఫోన్ లేదా ఇటీవల కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అయిన కస్టమర్లకు అందుబాటులో ఉంది. అలాగే, వీఐ వినియోగదారులు రూ. 239, అంతకంటే ఎక్కువ రోజువారీ డేటా అన్‌లిమిటెడ్ ప్లాన్‌ను కలిగి ఉండాలని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఆఫర్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఈశాన్య, ఒరిస్సా మినహా అన్ని చోట్ల అందుబాటులో ఉంది.