Vishal Megamart IPO: ముగిసిన విశాల్ మెగామార్ట్ ఐపీఓ.. 28 రేట్ల సబ్‌స్క్రిప్షన్‌..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-13 15:15:37.0  )
Vishal Megamart IPO: ముగిసిన విశాల్ మెగామార్ట్ ఐపీఓ.. 28 రేట్ల సబ్‌స్క్రిప్షన్‌..!
X

దిశ, వెబ్‌డెస్క్: గురుగ్రామ్(Gurugram)కు చెందిన ప్రముఖ సంస్థ విశాల్ మెగామార్ట్(Vishal Megamart) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO) బిడ్డింగ్ ప్రక్రియ ఈ రోజు ముగిసింది. ఈ సంస్థ ఐపీఓకు మొదటి రెండు రోజులు నామమాత్రంగా స్పందన లభించిన విషయం తెలిసిందే. కానీ చివరి రోజు మాత్రం ఇన్వెస్టర్ల(Investers) నుంచి భారీ స్పందన లభించింది. కాగా విశాల్ మెగామార్ట్ ఐపీవో ద్వారా సుమారు రూ. 8,000 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వగా.. శుక్రవారం నాటికి 28 రేట్ల సబ్‌స్క్రిప్షన్‌(Subscription) అందుకుంది. ఇందులో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల(QIB) నుంచి అత్యధికంగా 85.11 రేట్ల సబ్‌స్క్రిప్షన్లు రాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల(Retail Investors) నుంచి 2.43 రేట్ల సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. ఇక నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(NII)నుంచి ఏకంగా 15 శాతం బిడ్లు ధాఖలయ్యాయి. కాగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,400 కోట్లను సమీకరించినట్లు సంస్థ ఇదివరకే తెలిపింది.


Also Read :

OTT MOVIES: ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే.. ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే..?

Advertisement

Next Story