- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
100 మిలియన్ డాలర్ల అప్పు చెల్లించిన వేదాంత!
న్యూఢిల్లీ: ఇటీవల అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం నేపథ్యంలో వేదాంత రీసొర్సెస్ అప్పుల్లో ఉందనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత తన రుణ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. బుధవారం సింగపూర్‌కు చెందిన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుకు ఇవ్వాల్సిన 100 మిలియన్ డాలర్ల రుణాలను చెల్లించినట్టు ప్రకటించింది. ఈ చెల్లింపు గత నెల 10వ తేదీనే పూర్తయిందని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది.
గతేడాది సెప్టెంబర్‌లో వేదాంతాకు చెందిన ట్విన్‌స్టార్ హోల్డింగ్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంది. దీనికి వేదాంతతో పాటు వెల్టర్ ట్రేడింగ్ కూడా హామీ ఇచ్చింది. ఆ మొత్తాన్నే తాజాగా తిరిగి చెల్లించామని, దీంతో గడిచిన 11 నెలల కాలంలో సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైన రుణాలను తిరిగి చెల్లించినట్టు కంపెనీ వివరించింది.
ఈ ఏడాది జూన్ నాటికి మరిన్ని నిధులు సమీకరించుకోగలమని కంపెనీ అభిప్రాయపడింది. మెచ్యూరిటీ కానున్న 900 మిలియన్ డాలర్ల విలువైన రుణాలను చెల్లించేందుకు తగినన్ని నిధులు తమ వద్ద ఉన్నాయని ఇటీవల అనిల్ అగర్వాల్ పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు.