- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US news: జులైలో తగ్గిన అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం
దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న ద్రవ్యోల్బణం చివరకు తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బుధవారం విడుదల అయిన లేబర్ డిపార్ట్‌మెంట్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ గణంకాల ప్రకారం, జులై నెలలో అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం 2.9 శాతానికి పడిపోయింది. అంతకుముందు జూన్ నెలలో ఇది 3 శాతంగా నమోదైంది. ఒక నెల వ్యవధిలోనే ఇది 0.1 శాతం తగ్గింది.కరోనా మహామ్మారి ప్రారంభమైన తర్వాత బలమైన ధరల పెరుగుదల కారణంగా వినియోగదారుల ధరల సూచిక భారీగా పెరిగింది. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. అయితే క్రమంగా ధరలు తగ్గుముఖం పడుతుండటంతో వినియోగదారుల కొనుగోలు శక్తి పుంజుకుంటుంది.
చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయి. అంతకుముందు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచింది. దీంతో వస్తువులు, సేవల కోసం డిమాండ్‌ను మందగించడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం అంచనాలకు అనుగుణంగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటంతో ఫెడరల్ సెప్టెంబర్ 17-18 పాలసీ సమావేశంలో వడ్డీ రేటు తగ్గింపుపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే, జులైలో నిరుద్యోగం రేటు మూడేళ్ల గరిష్ట స్థాయి 4.3 శాతానికి పెరిగింది. నిరుద్యోగిత రేటులో వరుసగా నాలుగో నెలవారీ పెరుగుదల కనిపించింది.