- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sports Bike: అదిరిపోయే సూపర్ స్పోర్ట్స్ లుక్‌తో ట్రయంఫ్ కొత్త బైక్.. ధర ఎంతంటే..
దిశ, బిజినెస్ బ్యూరో: ట్రయంఫ్ కంపెనీ ఇండియాలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘డేటోనా 660’. చూడటానికి సూపర్ స్పోర్ట్స్ లుక్‌తో అదిరిపోయే డిజైన్‌తో వచ్చింది. ధర రూ. 9.72 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ 660cc లిక్విడ్-కూల్డ్ మూడు-సిలిండర్ మోటార్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 11,250rpm వద్ద 95 bhp పవర్, 8,250rpm వద్ద 69Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 14-లీటర్లు. స్నోడోనియా వైట్, శాటిన్ గ్రానైట్, కార్నివాల్ రెడ్ కలర్స్‌లో లభిస్తుంది. దీనిలో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు. ముందు డిస్‌ప్లేలో రైడింగ్‌కు సంబంధించిన డేటా, టర్న్-బై-టర్న్ నావిగేషన్, అలాగే USB సాకెట్, ఫోన్, మ్యూజిక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, LED హెడ్‌లైట్, ట్రయంఫ్ ప్రొటెక్ట్ + అలారం సిస్టమ్, ట్రాకర్ వంటి పలు ఫీచర్లను అందించారు. బైక్ మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అవి స్పోర్ట్స్, రోడ్, రెయిన్. బ్రేకుల విషయానికి వస్తే ముందు భాగంలో 310 ఎంఎం డిస్క్‌ను అమర్చారు. సీట్ ఎత్తు 810 మిమీగా ఉంది.