- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర యాప్‌ల నియంత్రణకు చర్యలు మొదలుపెట్టిన ట్రాయ్
న్యూఢిల్లీ: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ మొదలైన OTT(ఓవర్-ది-టాప్) ఆధారిత యాప్‌లను నియంత్రించడానికి రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చర్యలు మొదలు పెట్టింది. ఇంటర్నెట్ ఆధారిత కాల్స్, మెసేజింగ్ యాప్‌లను పర్యవేక్షించడం దీని ఉద్ద్యేశం. OTT యాప్‌ల్లో వచ్చే కంటెంట్ నియంత్రణ, వాటి లైసెన్సింగ్, ప్రైవసీ, సెక్యూరిటీ వంటి అంశాలకు సంబంధించి మొత్తం 14 పాయింట్లను సర్వీస్ ప్రొవైడర్‌లతో చర్చించనున్నారు.
అలాగే ఒక ప్రాంతంలో హింస, గొడవలు లాంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నారు. దాంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు, ఆరోగ్యం, విద్య మొదలైన వాటిపై ప్రభావం చూపుతుంది. అయితే మెసేజింగ్ యాప్‌ల ద్వారానే అలాంటి ప్రాంతాల్లో తీవ్రవాదులు లేదా సంఘ వ్యతిరేక వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీని కట్టడి కోసం మొత్తం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాల్సి వస్తుంది. అయితే ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మొత్తంగా ఇంటర్నెట్‌ని నిషేధించే బదులు ఎంపిక చేసిన OTT ఆధారిత యాప్‌లను నిషేధించే ఆప్షన్‌ను చర్చించనున్నట్లు సమాచారం.
- Tags
- OTT Platform