- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRAI: ట్రేస్‌బిలిటీ మార్గదర్శకాల అమలు గడువును పొడిగించిన ట్రాయ్
దిశ, బిజినెస్ బ్యూరో: టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పామ్ మెసేజ్‌ల నివారణ కోసం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాల అమలు గడువును పొడిగించింది. టెలికాం కంపెనీలు, టెలిమార్కెటర్లకు సాంకేతికంగా సరిచేసుకునేందుకు, మెసేజ్‌ల డెలివరీలో ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా ఉండేందుకు గడువును డిసెంబర్ 11 వరకు పొడిగిస్తున్నట్టు ఆదివారం ప్రకటనలో వెల్లడించింది. వన్‌టైమ్ పాస్‌వర్డ్‌లు సహా కమర్షియల్ మెసేజ్‌ల కోసం ట్రేసబిలిటీ ఆదేశాలను ట్రాయ్ ప్రతిపాదించింది. వైట్‌లిస్ట్ చేయని యూఆర్ఎల్, ఓటీటీ లింక్స్, ఏపీకే ఉన్న మెసేజ్‌లను నిలిపివేయాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ట్రాయ్ నిబంధనల్లో టెలికాం కంపెనీలు, టెలిమార్కెటర్లు వినియోగదారులకు పంపే ఓటీపీలు నిజమైనని ధ్రువీకరించుకున్న తర్వాతే పంపాలి. అయితే, ఈ ఫిల్టర్ ప్రక్రియ వల్ల నెట్ బ్యాంకింగ్, ఆధార్ వంటి ఓటీపీలు ఆలస్యమవుతాయని సందేహాలు పెరిగాయి. కానీ, ట్రాయ్ దీన్ని నిరాకరిస్తోంది. అవన్నీ ఒట్టి ప్రచారం మాత్రమేనని స్పష్టం చేసింది. ఇటీవల టెలిమార్కెటర్లు, బ్యాంకులు సహా వ్యాపార సంస్థలు కొత్త నిబంధనలకు సాంకేతికంగా సిద్ధంగా లేవని టెల్కోలు ట్రాయ్‌కు చెప్పాయి. ఈ కారణంగా గడువును పొడిగిస్తూ ట్రాయ్ నిర్ణయం తీసుకుంది.