Tim Brooks: ఓపెన్ ఏఐ ఎగ్జిక్యూటివ్ పదవికి టిమ్ బ్రూక్స్ రాజీనామా

by Maddikunta Saikiran |
Tim Brooks: ఓపెన్ ఏఐ ఎగ్జిక్యూటివ్ పదవికి టిమ్ బ్రూక్స్ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: చాట్ జీపీటీ(Chat GPT) సృష్టికర్త ఓపెన్ ఏఐ ఎగ్జిక్యూటివ్(Open AI Executive) టిమ్ బ్రూక్స్(Tim Brooks) తన పదవికి రాజీనామా(Resignation) చేశారు. అతను ఓపెన్ ఏఐ నుంచి వైదొలిగి గూగుల్ డీప్ మైండ్(Google Deep Mind)లో చేరారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా 'ఎక్స్ (X)' వేదికగా వెల్లడించారు. వీడియో జనరేషన్ సంబంధిత విభాగాల్లో పని చేయడానికి గూగుల్ డీప్ మైండ్ లో చేరుతున్నట్టు ఆయన తెలిపారు. గూగుల్ లోని ప్రతిభావంతులైన ఉద్యోగులుతో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తిగా ఎదురుస్తున్నానని పేర్కొన్నారు. ఓపెన్ ఏఐలో సోరా(Sora)ను తీసుకురావడానికి రెండు సంవత్సరాలు విధులు నిర్వహించాను.నా జీవితంలో అది మరిచిపోలేని అనుభవం.నాతో పని చేసిన వ్యక్తులందరికీ ధన్యవాదాలు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత టెక్స్ట్-టు-వీడియో జనరేటర్ మోడల్ సోరా ను తీసుకురావడంలో టిమ్ బ్రూక్స్ ముఖ్యమైన పాత్ర పోషించారు. కాగా ఓపెన్ ఏఐలో కీలకమైన పదవుల్లో ఉన్నవారందరూ వరుసగా రాజీనామా చేస్తున్నారు. ఇటీవలే ఆ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(CTO) మిరా మురాటి(Mira Murati) తన పదవి బాధ్యతల నుంచి తప్పుకోగా.. తాజాగా ఎగ్జిక్యూటివ్ పదవికి టిమ్ బ్రూక్స్ రాజీనామా చేశారు.

Advertisement

Next Story