- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Infosys : వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలి
బెంగళూరు: ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయాలని ఆదేశిస్తూ ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో వెల్లడించింది. మరికొద్ది రోజుల తర్వాత ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీస్ నుంచి పనిచేయాలని సూచించనున్నట్టు స్పష్టం చేసింది. ఇదివరకు అక్టోబర్‌లో సైతం కంపెనీ తన 5,6 లెవల్ స్థాయి ఉద్యోగులకు సైతం ఇవే ఆదేశాలిచ్చింది. వారు నెలలో 10 రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని కోరింది. అయితే, ఈ ఆదేశాలకు ముందు కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ రిమోట్ వర్క్ మోడల్‌లో 'ఫ్లెక్సిబుల్' విధానానికి సానుకూలమని చెప్పారు. 'సందర్భానుసారం క్లయింట్ల నుంచి వచ్చిన ప్రాజెక్టును బట్టి అందరూ కలిసి పనిచేయాలని భావించినపుడు ఉద్యోగులు ఆఫీసులకు రావాలని ఆశిస్తున్నాం. లేదంటే కంపెనీ ఉద్యోగుల సౌకర్యానికి తగినట్టు ఫ్లెక్సిబుల్ పని విధానానికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నామని' కంపెనీ రెండో త్రైమాసికంలో సలీల్ పరేఖ్ చెప్పారు.
- Tags
- infosys