Income Tax: ఇల్లు కొనాలా? రెంట్‌కి ఉండాలా? బడ్జెట్‌ తర్వాత సామాన్యుడిని వేధిస్తున్న ప్రశ్న ఇదే.. ఇంతకీ ఏం చేయాలి?

by Vennela |
Income Tax: ఇల్లు కొనాలా? రెంట్‌కి ఉండాలా? బడ్జెట్‌ తర్వాత సామాన్యుడిని వేధిస్తున్న ప్రశ్న ఇదే.. ఇంతకీ ఏం చేయాలి?
X

దిశ, వెబ్‌డెస్క్: Income Tax: ఇల్లు కొనడం, కట్టడం మామూలు విషయం కాదు. ఇల్లు కొనాలన్నా, కట్టాలన్నా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ప్రాపర్టీ ధరలు భారీ ఉండటంతో కిరాయి తీసుకోవడమే మంచిది అనుకోవచ్చు. కానీ ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది. లాభ, నష్టాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ను ప్రార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించదని చెప్పవచ్చు. చాలా వరకు పన్ను భారం తీర్చింది. అయితే చాలా మంది సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంటిని కొనుగోలు చేయడం మంచిదా..లేదా కిరాయి ఇంట్లో ఉండటం మంచిదా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ విషయంలో తీసుకునే నిర్ణయం ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇంటిని కొనుగోలు చేయడం అంటే మామూలు వ్యవహారం కాదు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. ప్రాపర్టీ ధరలు భారీగా ఉండటంతో కిరాయికి తీసుకోవడమే మంచిదని అనుకోవచ్చు. కానీ ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది. లాభ, నష్టాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

ప్రాపర్టీని కొనుగోలు చేసినప్పుడు పాత పన్ను విధానంలో పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. హోంలోన్ ఈఎంఐలోని ప్రిన్సపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ పేమెంట్ పై పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. ప్రిన్సిపల్ రీపేమెంట్ పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వంటి ఖర్చలు సహా సెక్షన్ 80సి కింద రూ. 1.5లక్షల వరకు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంట్లో స్వయంగా ఉంటున్నా లేదా కిరాయికి ఇచ్చినా సరే గృహయజమానులు హోమ్ లోన్ వడ్డీపై ఏడాదికి రూ. 2లక్షల వరకు డిడక్షన్ పొందవచ్చు.

మీరే ఇంట్లో ఉన్నట్లయితే ఎలాంటి అద్దె ఆదాయం లేనట్లయితే హోంలోన్ వడ్డీని నష్టంగా పరిగణించవచ్చు. ఈ నష్టాన్ని ఇతర ఆదాయంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నష్టం ఈ పరిమితిని మించి ఉంటే దానిని 8ఏళ్ల వరకు క్యారీ ఫార్వర్డ్ చేయవచ్చు. ఒక వ్యక్తి మూడు లేదా అంతకంటే ఎక్కువ ప్రాపర్టీలు కలిగి ఉంటే, పన్ను చట్టాలు కేవలం రెండు ఆస్తులను మాత్రమే సెల్ఫ్ ఆక్యుపైడ్ గా పరిగణిస్తాయి. మిగిలిన వాటికి ఎస్టిమేటెడ్ మార్కెట్ రెంట్ ఆధారంగా పన్ను విధిస్తారు.

అద్దె ఇంట్లో కలిగే ప్రయోజనాలు: ఉద్యోగులు హౌస్ రెంట్ అలవెన్స్ పై ట్యాక్స్ ఎగ్జమ్షన్ పొందవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఇండివిజ్యువల్స్ అయితే పాత పన్ను విధానంలో ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి నెలకు రూ. 5వేల వరకు డిడక్ట్ చేసుకోవచ్చు. సాధారణంగా ప్రతినెలా హోంలోన్ ఈఎంఐకి చెల్లించే డబ్బు కంటే ఇంటి అద్దె తక్కువగానే ఉంటుంది. మీరు పని చేసే చోటు లేదా జీవనశైలి అవసరాల ఆధారంగా అవసరమైనప్పుడు ఇల్లు మారవచ్చు. మీకు ఎలాంటి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఉండవు. ఇంటి యజమానికే బాధ్యత ఉంటుంది.

Next Story