- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత విమానయాన మార్కెట్లో ఆరోగ్యకరమైన, కఠినమైన పోటీ ఉంది: ఇండిగో సీఈఓ
దిశ, బిజినెస్ బ్యూరో: భారత విమానయాన మార్కెట్లో ఆరోగ్యకరమైన వాతావరణం, కఠినమైన పోటీ ఉందని ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈఓ పీటర్ ఎల్బర్స్ అన్నారు. ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది. కొత్త గమ్యస్థానాలను కనెక్ట్ చేయడం ద్వారా విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరింపజేస్తున్నాయి, అయితే రద్దీ సమయాల్లో విమాన చార్జీలు ఎక్కువగా ఉండటం వలన కొన్ని వర్గాలు ఆందోళనలకు గురవుతున్నాయని దేశంలో విమాన టిక్కెట్ ధరలు నియంత్రణ లేకుండా ఉన్నాయని ఆయన అన్నారు. భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్‌లలో ఒకటి. సగటున, రోజువారీ దేశీయ విమాన ట్రాఫిక్ సంఖ్య 4.3-4.5 లక్షలు, దేశీయ విమానయాన సంస్థలు 2023లో 15.20 కోట్ల మంది ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు తీసుకువెళ్లాయి. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ చార్జీలు తక్కువగా లేకపోయినా కూడా ఈ విభాగంలో భారీ పోటీ ఉందని తెలిపారు. దేశీయ మార్కెట్‌లో 60 శాతం కంటే తక్కువ వాటా, 360 కంటే ఎక్కువ విమానాలను ఇండిగో ఎయిర్‌లైన్ కలిగి ఉంది. ఈ నెల ప్రారంభంలో, ఆకాశ ఎయిర్ వ్యవస్థాపకుడు, సీఈఓ వినయ్ దూబే మాట్లాడుతూ, భారతదేశంలో విమాన చార్జీలు చాలా తక్కువ ధరలో ఉన్నాయని పేర్కొనడం గమనార్హం.