ఇష్టం వచ్చినట్లు బంగారం కొంటున్నారా.. లిమిట్ దాటితే రిస్కే..!

by Harish |   ( Updated:2023-05-25 16:30:18.0  )
ఇష్టం వచ్చినట్లు బంగారం కొంటున్నారా.. లిమిట్ దాటితే రిస్కే..!
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టమైనది. ప్రతి శుభకార్యంలో తప్పనిసరిగా బంగారం ధరించాల్సిందే. బంగారానికి ఉన్న డిమాండ్ కారణంగా ఈ మధ్య కాలంలో అత్యంత విలువైనదిగా మారిపోయింది. ధర ఎంత ఉన్నప్పటికీ కూడా బంగారం కొనే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే బంగారం కొనుగోలు చేసే సమయంలో లక్షలకు లక్షలు పెట్టి కొనుగోలు చేస్తుంటారు. కానీ దీనికి ఒక లిమిట్ ఉంటుంది. పాన్ కార్డు, ఆధార్ కార్డు లాంటి ఐడీ ప్రూఫ్స్ లేకుండా ఎక్కువ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేయడం కుదరదు.



కేంద్రం 2002లో బంగారు ఆభరణాలు, రత్నాలు వంటి వాటిని మనీ లాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం సరైన పత్రాలు లేకుండా, పరిమితికి మించి బంగారం ఎగుమతులు, దిగుమతులు చేయరాదు. అలాగే దేశీయంగా కూడా లిమిట్ ప్రాతిపదికన బంగారం కొనుగోలు చేయాలి. ఒకవేళ లిమిట్ దాటి కొనాలంటే తప్పనిసరిగా పాన్, ఆధార్ వంటి కేవైసీ డాక్యుమెంట్స్ అందివ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2020లో ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకేసారి రూ.10 లక్షలకు మించి బంగారం కొనుగోలు చేసే వారి వివరాలను వెంటనే ప్రభుత్వానికి అందించాలని ఆభరణాల సంస్థలు, వ్యాపారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


నగదు ద్వారా అయితే ఒక వ్యక్తి ఒక రోజులో రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తం నగదుతో బంగారం కొనుగోలు చేయడానికి అనుమతి లేదు. ఒకవేళ ఈ లిమిట్ దాటినట్లయితే సంబంధిత షాపు యజమాని ప్రభుత్వానికి జరిమానా కట్టాల్సి ఉంటుంది. రూ.2 లక్షలకు మించి(నగదుతో లేదా ఆన్‌లైన్ ద్వారా) బంగారు ఆభరణాలు కొనాలంటే తప్పనిసరిగా పాన్, ఆధార్ ఐడీ ప్రూఫ్స్ సమర్పించాలి.

Advertisement

Next Story