- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏకంగా బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసిన RBI
దిశ, బిజినెస్ బ్యూరో: ముంబైకి చెందిన ది సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఈ చర్య తక్షణం జూన్ 19, 2024న కార్యకలాపాలు ముగిసినప్పటి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఇకపై ఈ బ్యాంక్ డిపాజిట్ల స్వీకరణ చేయడం లేదా డిపాజిట్‌లను తిరిగి చెల్లించడం లాంటివి చేయడానికి వీలు లేదు. సహకార కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్, మహారాష్ట్ర కూడా ఈ బ్యాంకును మూసివేయడానికి ఒక ఉత్తర్వు జారీ చేయాలని, అలాగే బ్యాంకు కోసం లిక్విడేటర్‌ను నియమించాలని అభ్యర్థించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.
బ్యాంకుకు తగిన మూలధనం, ఆదాయ అవకాశాలు లేనందున తప్పనిసరి పరిస్థితుల్లో లైసెన్స్‌ను రద్దు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక స్థితితో డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించలేకపోతుంది, ఇలాంటి టైంలో తన బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించడానికి అనుమతించినట్లయితే ప్రజా ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్‌బీఐ పేర్కొంది. డీఐసీజీసీ చట్టం, 1961, ఆర్‌బీఐ నిబంధనలకు లోబడి రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని కస్టమర్లు పొందడానికి అవకాశం ఉంది. బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం, మొత్తం డిపాజిటర్లలో 87 శాతం మంది డీఐసీజీసీ నుండి తమ పూర్తి డిపాజిట్లను తిరిగి స్వీకరించడానికి అర్హులుగా ఉన్నారు.