- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
The price of a lemon: రైతులకు శుభవార్త.. నింగిని తాకిన నిమ్మ ధర
దిశ వెబ్ డెస్క్: వేసవి కాలం ప్రారంభం అయిందోలేదో అప్పుడే సూర్యుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 9 గంటలు దాటితే చాలు ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. పెరిగిన ఎండ తీవ్రతను తట్టుకునేందుకు నిమ్మకాయ షర్బత్ ను నమ్ముకుంటున్నారు. దీనికితోడు ఈ ఏడాది నిమ్మకాయల ఉత్పత్తి కూడా తగ్గింది. సాధారణంగా నిమ్మకాయలు కర్ణాటకలో అత్యధికంగా పండుతాయి. అయితే ఈసారి కురిసిన వర్షాలు కారణంగా నిమ్మపూత ఎక్కువగా రాలిపోయి వాటి ఉత్పత్తి దాదాపు 40 శాతం మేర పడిపోయింది.
దీనితో అమాంతం నిమ్మకాయ ధర నింగిని తాకింది. నిన్న మొన్నటి వరకు 20 రూపాయలకు అరడజను నిమ్మకాయలు లభిస్తుండాగా.. ప్రస్తుతం అరడజను నిమ్మకాయలు ధర 40కి పెరిగింది. ఇక విడిగా కొనాలి అంటే ఒక్కో నిమ్మకాయ ధర రూ/ 10 పలుకుతోంది. అలానే హోల్‌సేల్ మార్కెట్‌లో నెల రోజుల క్రితం రూ. 2 వేల ధర పలికిన పెద్ద సైజు నిమ్మకాయల ధర ప్రస్తుతం రూ. 7 వేలకు పైగా పలుకుతోంది. కాగా దక్షణాది రాష్ట్రాలు అయిన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అధికంగా నిమ్మ సాగవుతుంది.
ప్రతి ఏడాది ఏపీలో 7 లక్షలు, కర్ణాటకలో 3 లక్షలు, తెలంగాణలో 1.5 లక్షల టన్నుల దిగుబడి వస్తుండగా.. ఈ ఏడాది ఆ దిగుబడి దాదాపు 40 శాతం మేర పడిపోయింది. దీనితో ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారలు చెబుతున్నారు. కాగా దక్షణాది రాష్ట్రాల్లో సాగు చేసే ఈ నిమ్మకాయలు రైతులు స్థానికంగా విక్రయించడంతోపాటు సూరత్, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతాతోపాటు చెన్నై మీదుగా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. అయితే ఈ ఏడాది కుసిసిన వర్షాల కారణంగా స్థానికంగానే నిమ్మకాయల కరువు ఏర్పడింది.