- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రూ.2 లక్షల కోట్లకు పెరిగిన టాప్-9 కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్
దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోలిస్తే వేగంగా అభివృద్ధి చెందడం, రాబోయే కాలంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధమవుతున్న తరుణంలో దేశీయంగానే కాకుండా విదేశీ పెట్టుబడులు సైతం భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఈక్విటీ మార్కెట్లో గత కొంత కాలంగా ఇన్‌ఫ్లోలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా గత వారం మార్కెట్ సెంటిమెంట్ కారణంగా టాప్-10 అత్యంత విలువైన సంస్థల్లోకి ఇన్‌ఫ్లోలు ఎక్కువగా రావడంతో వాటి మార్కెట్ వాల్యుయేషన్ భారీగా పెరిగింది. ఈ జాబితాలో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ.54,282.62 కోట్లు పెరిగి రూ.9,30,490.20 కోట్లకు చేరుకుంది, ఇది టాప్-10 సంస్థల్లో అత్యంత ఎక్కువగా లాభపడిన కంపెనీగా ఉంది. ఇది కాకుండా మిగిలిన తొమ్మిది కంపెనీలు కలిసి మార్కెట్‌కు కొత్తగా రూ. 2,01,552.69 కోట్లు జోడించాయి.
జాబితా ప్రకారం చూసినట్లయితే.. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,662.44 కోట్లు పెరిగి రూ.8,80,867.09 కోట్లకు చేరుకుంది, తర్వాత TCS రూ. 23,427.12 కోట్లు పెరిగి రూ. 16,36,189.63 కోట్లకు, ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.17,480.49 కోట్లు పెరిగి రూ.8,07,299.55 కోట్లకు, హిందుస్థాన్ యూనిలీవర్ రూ.22,438.6 కోట్లు పెరిగి రూ.6,89,358.33 కోట్లకు, HDFC బ్యాంక్ రూ.22,093.99 కోట్లతో రూ.12,70,035.77 కోట్లకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.9,878.19 కోట్లు పెరిగి రూ.19,92,160.61 కోట్లకు, SBI విలువ రూ.7,095.07 కోట్లు పెరిగి రూ.7,05,535.20 కోట్లకు, ITC రూ.15,194.17 కోట్లతో రూ.6,42,531.82 కోట్లకు చేరింది.