- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
5-door Thar: ఎట్టకేలకు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన 5-డోర్ మహీంద్రా థార్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో థార్ మోడల్ లవర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 5 డోర్ మహీంద్రా థార్ దేశీయ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఈ కొత్త మోడల్ పేరు ‘మహీంద్రా థార్ రోక్స్’. ఇది పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో వచ్చింది. పెట్రోల్ వేరియంట్ ధర రూ.12.99 లక్షలు. డీజిల్ మోడల్ ధర రూ.13.99 లక్షలు. స్టెల్త్ బ్లాక్, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, డీప్ ఫారెస్ట్, నెబ్యులా బ్లూ, బ్యాటిల్‌షిప్ గ్రే,యు బర్న్ట్ సియెన్నా కలర్స్‌లలో లభిస్తుంది.
గతంలో నాలుగు సంవత్సరాల క్రితం ఆగస్టు 15, 2020న థార్ 3-డోర్ SUVని తీసుకొచ్చారు. ఈ మోడల్ రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసింది. అయితే ఇది 3 డోర్లు కలిగి ఉండటంతో వినియోగదారులు 5 డోర్ కలిగిన థార్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఈ మోడల్ గురించి ఆన్‌లైన్‌లో కొన్ని లీక్‌లు రావడంతో దీనిపై వినియోగదారులకు మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు 5-డోర్ థార్ లాంచ్ కావడంతో అమ్మకాల పరంగా ఈ మోడల్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.
5-డోర్ మహీంద్రా థార్ రోక్స్: గతంలో వచ్చిన 3 డోర్ మోడల్ కంటే మరింత అధునాతన సస్పెన్షన్ సెటప్‌తో వచ్చింది. 2.0L టర్బో-పెట్రోల్ ఇంజన్ 160bhp పవర్, 330Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2.2L టర్బో-డీజిల్ వేరియంట్ 150bhp పవర్, 330Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు సిక్స్ స్పీడ్ మాన్యువల్, ఆటో మెటిక్ గేర్ బాక్స్‌ను కలిగి ఉన్నాయి.
LED టైల్‌లైట్లు, బంపర్‌పై ఫాగ్ ల్యాంప్‌లు, లోపల 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్, AC వెంట్‌లు, USB టైప్-సి చార్జింగ్ పోర్ట్‌లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESC ఇంకా మరిన్ని ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. బుకింగులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి. దసరా నుంచి డెలివరీలు చేస్తారు.