Thai AirAsia: థాయిలాండ్ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్-బ్యాంకాక్ మధ్య నాన్‌స్టాప్ ఫ్లైట్ ప్రారంభం

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-29 16:09:57.0  )
Thai AirAsia: థాయిలాండ్ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్-బ్యాంకాక్ మధ్య నాన్‌స్టాప్ ఫ్లైట్ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల నుంచి థాయిలాండ్(Thailand) రాజధాని బ్యాంకాక్‌(Bangkok) వెళ్లేవారి ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. రోజుకు కొన్ని వేల మంది ఈ దేశానికి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో థాయ్‌ ఎయిర్‌ఏషియా(Thai AirAsia) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్(HYD) నుంచి మరో విమాన సర్వీసును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విమాన సర్వీసును శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎయిర్‌పోర్ట్‌ సీఈవో ప్రదీప్‌ పణికర్‌(Pradeep Panicker) ప్రారంభించారు. ఈ నాన్‌స్టాప్ ఫ్లైట్(Non-stop Flight) సర్వీస్ ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో హైదరాబాద్ నుండి బ్యాంకాక్‌కి వెళ్తుందని వెల్లడించారు. కాగా ఈ ఫ్లైట్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(Rajiv Gandhi International Airport) నుండి రాత్రి 11:25 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు బ్యాంకాక్ లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి(Don Mueang International Airport) చేరుకుంటుంది. రిటర్న్ ఫ్లైట్ రాత్రి 8:50 గంటలకు బయలుదేరి రాత్రి 10:55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. కాగా థాయ్ ఎయిర్‌ఏషియా భారతదేశంలోని కోల్‌కతా, చెన్నై, జైపూర్, కొచ్చి, బెంగళూరు, గయా, లక్నో, అహ్మదాబాద్, గౌహతి, విశాఖపట్నం, తిరుచిరాపల్లి, హైదరాబాద్‌ నగరాల నుంచి వారానికి 67 విమానాలను నడుపుతోంది.

Advertisement

Next Story

Most Viewed