- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సామర్థ్యాల పెరుగుదలతో 2030 నాటికి రూ.3 లక్షల కోట్లకు వస్త్ర ఎగుమతులు: AEPC
దిశ, బిజినెస్ బ్యూరో: ఉత్పత్తి సామర్థ్యాలలో పెరుగుదల, శ్రామిక శక్తి నైపుణ్యం వంటి చర్యల వలన భారత్ నుంచి వస్త్ర ఎగుమతులు వృద్ధి చెందుతాయని అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (AEPC) చైర్మన్ సుధీర్ సెఖ్రి మంగళవారం అన్నారు. 2030 నాటికి రూ.3 లక్షల కోట్ల($40 బిలియన్ల) వస్త్ర ఎగుమతుల లక్ష్యాన్ని సాధించడంలో ఈ చర్యలు సహాయపడుతాయని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్నటువంటి టైలర్లు, నాణ్యత చెక్ చేసే కార్మికులు సరిపోవడం లేదు, ప్రతి సంవత్సరం సుమారు 1,50,000 మంది నైపుణ్యం కలిగిన కార్మికులను తయారు చేస్తున్నాము, అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి శ్రామిక శక్తిని శక్తివంతం చేయాల్సి ఉందని అన్నారు.
దేశంలోని ఎగుమతి సంస్థలు ఇప్పటికీ భారీ పరిమాణంలో ప్రాథమిక ఉత్పత్తులను నిర్వహించలేక పోతున్నందున సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని, దీనికి కేంద్రం కూడా సహకరిస్తోందని సుధీర్ సెఖ్రి తెలిపారు. వస్త్ర పరిశ్రమలో రాణించడానికి 2015లో అపెరల్ ట్రైనింగ్ అండ్ డిజైన్ సెంటర్ (ATDC) డిగ్రీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. దీనిలో చదువుకున్న వారిలో 10 శాతం అభ్యర్థులు సొంతంగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకోగా, దాదాపు 8 శాతం మంది తదుపరి చదువులు కొనసాగిస్తున్నారని AEPC కౌన్సిల్ పేర్కొంది.