- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tesla: భారత్‌లో టెస్లా నియామకాలు

దిశ, బిజినెస్ బ్యూరో: చాలా కాలంగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న గ్లోబల్ ఈవీ కార్ల బ్రాండ్ టెస్లా ఎట్టకేలకు అందుకు తగిన ప్రక్రియను ప్రారంభించింది. భారత్‌లో అధిక పన్నులు, ఇతర కారణాలతో ఇప్పటివరకు దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు టెస్లా అధినేత ఎలన్ మస్క్ వెనుకాడారు. తాజాగా కంపెనీ భారత మార్కెట్లో టెస్లా కోసం నియామకాలను ప్రకటించింది. ఇటీవల అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఎలన్ మస్క్ భేటీ అయిన రోజుల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనికి సంబంధించి లింక్‌డ్ఇన్‌లో కంపెనీ పోస్ట్ చేసింది. కస్టమర్ సర్వీస్, సేల్స్, వెహికల్ మెయింటెనెన్స్, బిజినెస్ ఆపరేషన్స్, మార్కెటింగ్ సహా 13 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో 12 ఉద్యోగాలు ఫుల్‌టైమ్ కాగా, ఒక ఉద్యోగం పార్ట్‌టైమ్ ఉంటుంది. వీటిలో కొన్ని ఉద్యోగాలు ఢిల్లీలో, డెలివరీ ఆపరేషన్స్, కస్టమర్ ఎంగేజ్‌మెంట్ వంటి ఉద్యోగాలు ముంబై కేంద్రంగా పనిచేసేందుకు నియమించుకున్నారు.
ఢిల్లీ, ముంబైలలో ఉద్యోగాలకు టెస్లా ప్రకటన విడుదల చేయడంతో ఈ రెండు చోట్లా షోరూమ్‌లను ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. అయితే, మస్క్ తన కంపెనీని కేవలం దిగుమతి చేయడమే కాకుండా స్థానికంగా కూడా తయారు చేయాలనే భారత ప్రభుత్వ కోరికకు కట్టుబడి ఉంటుందో లేదో స్పష్టంగా తెలియదు. గతేడాది ప్రభుత్వం స్థానిక తయారీ కోసం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడితే, ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకునే 8,000 టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలపై 15 శాతం అధిక సబ్సిడీ దిగుమతి సుంకాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల 40 వేల డాలర్ల(రూ. 34 లక్షలు) కంటే ఎక్కువ ఖరీదైన హైఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. మస్క్ గతేడాది భారత పర్యటనను కూడా ప్రకటించారు. కానీ తర్వాత దాన్ని రద్దు చేసుకున్నారు. తాజా పరిణామాలతో త్వరలో టెస్లా కార్లు మన రోడ్లపై తిరగనున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.